జమ్మలమడుగును పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి - సిపిఎం

70చూసినవారు
జమ్మలమడుగును పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి - సిపిఎం
కడప జిల్లా జమ్మలమడుగు ఎన్జీవో కార్యాలయంలో శనివారం సిపిఎం నాయకులు సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ఇన్ చార్జి నాయకులు మనోహర్ మాట్లాడుతూ జమ్మలమడుగులో పారిశ్రామికంగా అభివృద్ధి కావడానికి అన్ని రకాల పకృతి వనరులు వున్నాయని తెలిపారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, విభజన చట్టం హామీలను అమలు చేయాలని తెలిపారు. అభివృద్ధి చేస్తే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్