జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో పొలం వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ బుధవారం చోటుచేసుకుంది. ఈ గొడవలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో సుమారు 8మంది గాయపడ్డారు. గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.