జమ్మలమడుగు: అమ్మవారికి కార్తీక మాస పూజలు

65చూసినవారు
జమ్మలమడుగు: అమ్మవారికి కార్తీక మాస పూజలు
జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కన్యతీర్థం నందు కార్తీక మాసం శనివారం పురస్కరించుకొని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామ నుంచి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చన చేశారు. అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. మహిళలు ఆలయం ఎదుట కార్తిక దీపాలను వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్