కొండాపురం: త్రుటిలో తప్పిన ప్రమాదం

69చూసినవారు
కడప- తాడిపత్రి ప్రధాన రహదారిలోని కొండాపురం మండలం పీ. అనంతపురం గ్రామం సమీపంలో బుధవారం లారీ పక్కకు ఒరిగింది. కడప వైపు నుంచి తాడిపత్రికి చెనక్కాయ చెక్కలోడుతో వెళ్తున్న లారీకి ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు లారీ కింద పడకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్