ముద్దనూరు మండలం మాదన్నగారి పల్లెలోమంగళవారం వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె. వి. కె. శాస్త్రవేత్త శిల్ప కళ మాట్లాడుతూ.. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు గురించి రైతులకు అవగాహన కల్పించి నివారణ చర్యలు తెలిపారు. పురుగును అరికట్టడానికి ప్రొపినో ఫాస్ 2 యమ్ యల్ లేదా లార్విన్ 1. 5 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. ఉల్లి పంటను పరిశీలించి సాగు వివరాలు తెలుసుకున్నారు.