యర్రగుంట్ల మండలం తిప్పలూరులో మంగళవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో.. జనసేన పార్టీ కోఆర్డినేటర్ జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రజా ప్రభుత్వం అని, కేవలం 100 రోజుల్లోనే అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో.. 13326 గ్రామ సభలను ఒకటేసారి నిర్వహించి ప్రపంచ రికార్డు కూడా సాధించారన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి పంచాయతీలో సంవత్సరానికి నాలుగు గ్రామ సభలు కూడా నిర్వహిస్తారని తెలిపారు.