చెన్నూరు మండలం వాటర్ గండి వద్ద ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు మృతుడు నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సీ కాలనీకి చెందిన బిల్లిపాటి బాబు ( 35 ) కొద్ది రోజులుగా కడప తిలక్ నగర్ లో నివాసము ఉండేవాడని తెలిపారు. మృతుడు ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి వాటర్ గండి వద్దకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి నీటిలో ఆడుకుందామని నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయినట్లు తెలిపారు.