ధరల స్థిరీకరణ నేపథ్యంలో ఈ-పంటలో నమోదు చేసుకున్న వారికి మాత్రమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని కడప జిల్లా సంయుక్త కలెక్టర్ అదితిసింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కందులు కొనుగోలుకు సంబంధించి ప్రతి రైతు ఈ-క్రాప్ చేయించుకోవాలని ఆమె సూచించారు. ఇప్పటికైనా రైతులు సాగు చేస్తున్న పంటలకు ఈ పంట నమోదు చేయించుకునేందుకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.