కమలాపురం నగర పంచాయతీలోని జగదీశ్వర్ రెడ్డి శనక్కాయల మిషన్ సమీపంలో సుమారు 4 నెలల నుంచి నుంచీ మంచినీటి పైపులైను లీకేజీ అయ్యి నీరు వృధాగా పోతుంది. 4 నెలల నుండి నీరు వృధాగా పోతుండటంతో పశువులు మునిగి నీటిని కలుషితం చేస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.