విత్తనాలు, ఎరువుల పరీక్షలను అందుబాటులో ఉన్న ప్రయోగశాలల్లో రైతులు ఉచితంగా చేయించుకోవచ్చునని డీఏవో నాగేశ్వరరావు, రీజనల్ డీడీఏ మల్లికార్జున పేర్కొన్నారు. కమలాపురం అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లో శుక్రవారం వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లో పనిచేస్తున్న వ్యవసాయాధికారులు శిక్షణ నిర్వహించారు. పరీక్షల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులు పంటలకు వినియోగించుకోవాలన్నారు.