కమలాపురం: మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తా: ఏపీఎం

68చూసినవారు
కమలాపురం: మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తా: ఏపీఎం
కమలాపురం మండలంలో స్వయం సహాయక సభ్యుల ( మహిళల) ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీఎం గంగాధర్ అన్నారు. కమలాపురం మండల వెలుగు ఏపీఎంగా గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ మండలంలోని స్వయం సహాయక గ్రూపులలోని మహిళలకు రుణాలు సకాలంలో అందించేందుకు సిబ్బందితో కలిసి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్