ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జ్యోతి తెలిపారు. కమలాపురం 4వ వార్డు సచివాలయంలో జరుగుతున్న ఆధార్ క్యాంపును ఆమె బుధవారం పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు అపార్ కార్డు చేస్తున్న నేపథ్యంలో ఆధార్ కార్డు మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పేర్లలో తప్పులున్నా, చిరునామా మార్పు తదితర వివరాలను సరి చేసుకోవచ్చునన్నారు.