భోగి పండుగను పురస్కరించుకొని వల్లూరు మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బుధవారం వైభవోపేతంగా గోదాదేవి కల్యాణోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రాల మధ్య గోదాదేవికి కల్యాణోత్సవ ఘట్టాన్ని ఘనంగా చేపట్టారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.