సికెదిన్నె పిఎస్ వద్దకు చేరుకున్న వర్రా కుటుంబ సభ్యులు
చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్ వద్దకు సోమవారం వర్రా రవీంద్ర రెడ్డి భార్య, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా వర్రా రవీంద్ర భార్య కళ్యాణి మాట్లాడుతూ ఈ రోజు వరకు తన భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పలేదని వారం రోజుల నుంచి నా భర్తను వేధించారన్నారు. ఇప్పటికిప్పుడు ఎలా అరెస్టు చేశారని నా భర్తకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే కారణం అన్నారు. తన భర్తను అరెస్టు చేసి తమకు సమాచారం ఇవ్వలేదన్నారు.