మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

77చూసినవారు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్దరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయం కొత్త భవనాల్లోని కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నీచర్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు అదుపు చేయలేని స్థితిలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా అనంతపురం కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్న మేఘ స్వరూప్ మదనపల్లె సబ్ కలెక్టర్ గా బదిలీ అయిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్