మదనపల్లెలో ఉరి వేసుకుని మహిళ ఆత్మ హత్య

83చూసినవారు
మదనపల్లెలో ఉరి వేసుకుని మహిళ ఆత్మ హత్య
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన బుధవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఎస్సై హరిహర ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు జగన్ కాలనీలో ఉంటున్న స్వాతి(35) భర్తకు దూరంగా ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటోంది. భర్తతో ఏడబాటు, ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్