కురబలకోట మండలంలోని అంగళ్లు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రైవేటు బస్సు గురువారం వేకువజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న 108 సిబ్బంది మనోహర్, బావజాన్, డిఎస్పి కొండయ్య నాయుడు సిఐలు ఘటన స్థలం వద్దకు చేరుకొని క్షతగాత్రులను చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.