నిమ్మనపల్లె: కొడవలితో తమ్మునిపై అన్న హత్యాయత్నం

66చూసినవారు
భూ వివాదంతో తోడ బట్టిన తమ్మున్ని అన్న కొడవలితో నరికిన ఉదంతం ఆదివారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. బాధితుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు. మండలంలోని ముష్టూరు పంచాయతీ, యరప్పగారిపల్లికి చెందిన చెండ్రాయప్ప కొడుకు శంకర(45)కు అతని అన్న కే గుర్రప్పకు ఆస్తి వివాదం నడుస్తోంది. శంకర సమీపంలోని పెద్దవంకకు బహిర్భూమికి వెళ్ళగానే తమ్ముడిపై పగతో ఉన్న అన్న గుర్రప్ప వంకలో ఉన్న తమ్మున్ని కొడవలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు ఘటన స్థలం వద్దకు రాగానే నిందితుడు పరారయ్యాడు. ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు

సంబంధిత పోస్ట్