రామసముద్రం మండలం కురిజల వీఆర్వో గా పనిచేస్తున్న జగదీష్ ఆచారి, చొక్కాడ్లపల్లి విఆర్ ఏగా పనిచేస్తున్న శంకరమ్మ ఉత్తమ ప్రతిభా అవార్డు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో గురువారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మదనపల్లి లో డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ చేతుల మీదగా అవార్డులు అందుకున్నారు. వీరికి రెవిన్యూ సిబ్బంది అభినందనలు తెలిపారు.