గ్రామాలు అభివృద్ధి చెందడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం

1582చూసినవారు
గ్రామాలు అభివృద్ధి చెందడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం
గుర్రంకొండ మండలం సంగసముద్రం పంచాయతీ నందు జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్రలో బిజెపి పీలేరు అసెంబ్లీ కన్వీనర్ పొత్తూరి శ్రీకాంత్ మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లేనని, పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్