పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్ప స్వామి మాల వేసి తిరుపతి నుండి శబరిమలై కు పయనమయ్యారు. శనివారం ఉదయం పంబ నుండి ఇరుముడి తో కాలినడకన అయ్యప్ప స్వామి వారి సన్నిధానం చేరుకున్నారు. ఆయన వెంట కుమారుడు రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ఉన్నారు.