పల్లె పండుగ వారోత్సవాలు భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 988 కోట్ల రూపాయల నిధులతో 3వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు నిర్మాణాలను భూమి పూజ చేయనున్న సందర్భంగా, సోమవారం ప్రొద్దుటూరులోని చౌటపల్లెలో రూ. 30లక్షల అంచనాతో 650 మీటర్ల మేర నూతన సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి భూమి పూజ నిర్వహించారు. పనులలో భాగంగా చౌటపల్లిలోని కెవిఆర్ కాలనీ సిమెంటు రోడ్డు నిర్మాణoనకు ప్రతిపాదన చేసి పనులు ప్రారంభించారు.