ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున బాణ సంచారం
ప్రొద్దుటూరు దసరా అంటే ఆ ప్రాంత వాసులకు పూనకాలే. నవరాత్రులలో భాగంగా. మొదటి 8 రోజులు అమ్మవారి అలంకరణలు, అభిషేకాలు, మండపాల దగ్గర భక్తుల కోలాహలం, ఇవన్నీ ఒక ఎత్తయితే. శనివారం అర్ధరాత్రి చివరి రోజు శమీ దర్శనం, తొట్టి మెరువణి తర్వాత నిర్వహించే బాణసంచా మరో ఎత్తు. లక్షలాది మంది భక్తులు శివాలయం సెంటర్కు చేరుకున్నారు. అక్కడ భారీగా బాణసంచా కాల్చగా భక్తులు వారి సెల్ఫోన్లలో బంధించారు.