కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను, వాగ్దానాలను నెరవేర్చేందుకు పోరాటం చేస్తానని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ప్రొద్దుటూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ. తనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిని బాధ్యతగా తీసుకుని, పార్టీకోసం పని చేస్తానని రాచమల్లు చెప్పారు.