ప్రొద్దుటూరు మండల వ్యాప్తంగా ఆదివారం వర్షం భారీ ఎత్తున కురుస్తోంది. ఉదయం నుంచి వాతావరణంలో మార్పు చోటుచేసుకుని మధ్యాహ్నం 3గంటలకు జల్లులు పడ్డాయి. మళ్లీ 4.45 గంటలకు ప్రొద్దుటూరు పట్టణంలో భారీవర్షం దంచి కొట్టింది. దీంతో పట్టణంలోని పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. కొద్దిరోజులుగా వర్షం పడకపోవడం, నేడు వర్షం రాకతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.