వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన పులివెందుల పట్టణంలోని జగనన్న కాలనీలో నిలిచిపోయిన ఇండ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇచ్చిన ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.