సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఆగస్టు 16 , 17, 18 తేదీలలో నెల్లూరులో మూడు రోజులు పాటు జరుగుతున్నాయని, జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ కోరారు. 16వ తేదీ నర్తకి శాలలో ఐదు గంటలకు బహిరంగ సభ జరుగుతుందన్నారు. బహిరంగ సభకు సిఐటియు జాతీయ అధ్యక్షురాలు హేమలత, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు పాల్గొంటున్నారని తెలిపారు.