సుండుపల్లె మండల కేంద్రానికి సమీపంలోని తిమ్మసముద్రంలో బాహుదానది ఒడ్డున వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఉదయం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి అభిషేకం, మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి అర్చనలు, స్వామి వారి గ్రామోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం అభిషేకం పూజలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రి చాందినీబండ్ల దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు.