మంత్రుల దృష్టికి ఒంటిమిట్ట సమస్యలు

78చూసినవారు
మంత్రుల దృష్టికి ఒంటిమిట్ట సమస్యలు
కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని పలు సమస్యలను శుక్రవారం ఒంటిమిట్ట మండలానికి చెందిన టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి ఓబినేని సుబ్బమ్మ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, మాజీ మంత్రి జవహర్ ను కలిసి అసెంబ్లీ ఆవరణంలో వినతిపత్రం అందజేశారు. కోదండ రామాలయం వద్ద నీటి సమస్య ఎక్కువగా ఉందని, ఒంటిమిట్ట మండలంలో భూ కబ్జాలు అధికంగా జరిగాయని వారికి తెలిపారు. టిడిపి నేతలు మామిళ్ళ ఈశ్వరయ్య, పామూరు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్