ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడంలో అధికారులు, పాలకులు విఫలం అవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాల్ల శ్రీనివాసులు ఆరోపించారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ముదివేడు రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఆర్ఆర్ ప్యాకేజి, భూమికి భూమి, ఎకరాకు 40 లక్షల పరిహారం ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. భూమిలేని వారికి 5 లక్షలు పరిహారం ఇవ్వక పేద రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.