రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర కులస్తులకు అన్ని విధాల అండగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని అజయ్ ఫంక్షన్ హాల్ నందు వడ్డెర విద్యావంతుల చైతన్య సదస్సు నిర్వహించారు. వడ్డెర్లు ఆర్థికంగా రాజకీయంగా రాణించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.