రాయచోటి - లక్కిరెడ్డిపల్లి మార్గం అధ్వానంగా మారింది. మాసాపేటలో వేంపల్లి క్రాస్ వద్ద రోడ్డు చెరువును తలపిస్తోంది. ఈ రోడ్డును పట్టించుకునే నాథు డే లేరా అని గ్రామస్థులు మండిపడుతున్నారు. వర్షం పడితే రోడ్డుపైన నీరు ఇళ్లలోకి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. నిత్యం ఎన్నో బస్సులు, ఆటోలు, కార్లు తిరిగే ఈ రోడ్డును ప్రజా ప్రతినిధులు చొరవచూపి బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.