ఉపాధి కోసం విదేశానికి వెళ్లి నరకయాతన..
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. పని ప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో ఆమెను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను రాంప్రసాద్ రెడ్డి కోరారు. కవిత స్వగ్రామానికి చేరుకుంది. శనివారం నారాయణరెడ్డి పల్లి చేరుకుంది.