రాయదుర్గం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వృద్ధుడి మృతి
బొమ్మనహాల్ మండలం శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వృద్ధుడు కొండయ్య మృతి చెందాడు. దేవగిరికి చెందిన కొండయ్య పొలం పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా మరో ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బళ్లారికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.