సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి: డీఎంహేచ్ఓ

64చూసినవారు
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి: డీఎంహేచ్ఓ
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహేచ్ఓ కొండయ్య వైద్య సిబ్బందికి సూచించారు. కోసువారిపల్లె, తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రులను శుక్రవారం సందర్శించారు. ల్యాబ్, ఓపీ, ప్రసూతి వార్డులు, ఆసుపత్రిలో పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. తంబళ్లపల్లెలో డెంగ్యూ బాధితుల ఇళ్లకు వెళ్లి ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. దోమల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్