అనారోగ్యంతో ఉన్న మహిళ బాధలు భరించలేక సోమవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు ముదివేడు సబ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన నాగ సుబ్బమ్మ(65) షుగర్ వ్యాధితో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెందిన ఆమె షుగరు మాత్రలలో నిద్ర మాత్రలు కలుపుకొని మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.