పెద్ద మండ్యం: కన్నతల్లిని హత్య చేసిన కొడుకు
కన్నతల్లిని కొడుకు హత్య చేశాడని మంగళవారం పెద్ద మండ్యం ఎస్సై రమణ తెలిపారు. సి. గొల్లపల్లిలో ఉండే ఓబులమ్మ(72)ను పెన్షన్ డబ్బులు కోసం 24వ తేదీన కుమారుడు ఓబులేసు కర్రతో దాడి చేశాడు. ఆమెను రాయచోటి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం ఆమె మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందడంతో ఓబులేసు పై హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.