మద్దినాయుని పల్లి గ్రామం దారంవాండ్ల పల్లిలో తాగునీటి సమస్యను శుక్రవారం తంబళ్లపల్లె నియోజకవర్గం టిడిపి బాధ్యులు జయచంద్ర రెడ్డి పరిష్కరించారు. ఆరు నెలలుగా త్రాగునీటి కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు సమస్యను పరిష్కరించాలని ఆయనకు విన్నవించారు. స్పందించిన ఆయన కొత్తగా బోరు వేయించి మోటారు ఏర్పాటు చేశారు. గ్రామంలో శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించారు.