కర్బూజ పండ్లు అంటే పిల్లలు, పెద్దలు ఇష్టపడి తింటుంటారు. కేవలం పండ్లే కాకుండా వాటిలో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే విటమిన్లు, పోషకాలు బీపీని నియంత్రిస్తాయట. శరీరంలోని వ్యర్థాలను బయటకు తోసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని చెబుతున్నారు. అలాగే ముఖంపై ముడతలు, మచ్చలు, కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. వీటిలో అధిక శాతం నీరు ఉండటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.