ఏపీలో మరో హనీట్రాప్ కలకలం రేపింది. విశాఖ జిల్లా భీమిలికి చెందిన ఓ యువతి ట్రాప్‌లో శ్రీకాకుళానికి చెందిన రామారావు పడ్డాడు. ఈ నెల 18న రామారావుకు యువతి ఫోన్ చేసింది. పెద్దిపాలెంకు రమ్మని చెప్పింది. అక్కడికి వెళ్లిన రామారావును నలుగురు కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆయన వద్ద నుంచి రూ.48 వేలు, ఏటీఎం కార్డు లాక్కుని పారిపోయారు. ఏటీఎంలో రూ.7 వేలు విత్‌డ్రా చేశారు. దాంతో బాధితుడు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.