AP: గుంటూరు జిల్లా తెనాలిలో ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. మల్లెపాడుకు చెందిన శ్రీరామరాజుపై రౌడీషీటర్ అరుణ్ దాడి చేశాడు. పిలవగానే వచ్చి బండి ఎక్కించుకోలేదని, ఎదురు చెప్పినందుకు కోపంతో రాజు చెవిలో బైక్ కీతో అరుణ్ పొడిచాడు. కత్తి తీసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చెవికి తీవ్ర గాయమైన రాజు ఆస్పత్రిలో చేరారు.