భారత మాజీ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. అతడి భార్య ఆర్తి అహ్లావత్ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రాంలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు తెలిసింది. 2004లో సెహ్వాగ్ ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. గత దీపావళి రోజు సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫొటోలు షేర్ చేయడం విడాకుల వార్తకు బలం చేకూరుస్తోంది.