AP: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. గతంలోనే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన.. జనసేనలో చేరతానని అప్పుడే ప్రకటించారు. తాజాగా అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను దొరబాబు కలిసి చెరికపై చర్చించారు. కాగా 2014లో వైసీపీలో చేరిన దొరబాబు 2019లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే అనూహ్యంగా 2024లో ఆయనకు వైసీపీ నుంచి సీటు దక్కకపోవడంతో ఆ పార్టీని వీడారు.