డిసెంబర్‌లో సీఎం మార్పు ఖాయం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

56చూసినవారు
డిసెంబర్‌లో సీఎం మార్పు ఖాయం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జి మారారంటే.. తర్వాత మారేది ముఖ్యమంత్రేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. "సీఎం ఛేంజ్‌ అనే మిషన్‌ను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించారు. సీఎంను మార్చేందుకు ఆమె గ్రౌండ్‌ సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌లో ముఖ్యమంత్రి మార్పు ఖాయం. కాంగ్రెస్‌ సర్కార్‌ పూర్తిగా గాడి తప్పింది. ఒక్క మంత్రి కూడా సీఎంని ఖాతరు చేయడంలేదు" అని అని అన్నారు.

సంబంధిత పోస్ట్