AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొమిల్ జైన్, అపూర్వ విజయ్ కాంత్ చాన్దాలకు మరో షాక్ తగిలింది. ఈ కేసులో పొమిల్ జైన్, అపూర్వ విజయ్ కాంత్ చావ్దాలను మరోసారి కస్టడీకి అనుమతి ఇస్తూ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.