జర్మనీలో ఓ కారు అక్కడి జనాల గుంపుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, డౌన్‌టౌన్ ఏరియాలోకి రావద్దని మ్యాన్‌హైమ్‌వాసులకు ఆదేశాలు ఇచ్చారు. ‘ప్రాణహాని పరిస్థితి’ నెలకొందని తెలిపారు.