టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనంతిక సునీల్ కుమార్ అందరికీ సుపరిచితమే. ‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’. ఫణీంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ దుగ్గిరాల హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీలోని ‘అందమా అందమా’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.