AP: కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. అవినాష్‌రెడ్డి తనను వేధిస్తున్నారంటూ అనంతపురం ఎస్పీ జగదీష్‌కి రాప్తాడు మండలం ఆకుతోటపల్లికి చెందిన శేషానందరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన కుటుంబ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని శేషానందరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.