గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బోడెలి తాలూకా పనేజ్ గ్రామంలో ఓ ఐదేళ్ల బాలికను లాలూభాయ్ అనే వ్యక్తి బలి ఇచ్చాడు. బాలికను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి తాంత్రిక పూజలు చేసి ఆపై గొడ్డలితో నరికి బలి ఇచ్చాడు. బాలిక తమ్ముడిని కూడా బలి ఇచ్చే క్రమంలో గ్రామస్థులు గమనించి బాలుడిని రక్షించి అతడిని పోలీసులకు పట్టించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.