నిధి అగర్వాల్ తెలుగులో రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్, పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు మూవీలతో త్వరలో ప్రేక్షకులను అలరించనుంది. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి రాజా సాబ్ మూవీలోని తన పాత్రపై క్లారిటీ ఇచ్చారు. తాను ఈ మూవీలో దెయ్యం పాత్రలో కనిపించడం లేదని, తన పాత్ర అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తుందని అన్నారు.